సమగ్ర శిక్షా అభియాన్(SSA) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘం తపస్(TPUS) డిమాండ్ చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ అన్నారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా సమగ్ర శిక్షా అభియాన్ సిబ్బంది నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ స్పందించాల్సి ఉందన్నారు.
డిమాండ్లు ఇవే…
మినిమం బేసిక్ పే చెల్లించాలి
ఉద్యోగులందరికీ జీవిత బీమా కల్పించాలి
ఉద్యోగులు, వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి