ఎల్లుండి(26న) పాఠశాలల బంద్ కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) పిలుపునిచ్చింది. విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అన్ని స్కూళ్లు బంద్ చేయాలని కోరింది. ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ(Distribution) చేయకపోవడంతో బడులు ప్రారంభమైన 12 రోజుల నుంచీ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ABVP నాయకులు అంటున్నారు.
విద్యాలయాల్లో ఎక్కడా ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో భారీస్థాయిలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యుల్ని అవస్థల పాలు చేస్తున్నారని, దీన్ని నివారించాలంటే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ABVP డిమాండ్ చేస్తున్నది. మౌలిక వసతులు కల్పించాలంటూ తాము చేపట్టిన బంద్ కు సహకరించి స్కూళ్లు మూసివేయాలని కోరింది.