ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధులు మంజూరవుతున్నాయి. పరిశుభ్రత(Cleaning)తోపాటు ఇతర నిర్వహణ బాధ్యతల్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల(AAPC)కు అప్పగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. స్కూళ్ల మెయింటెనెన్స్ కు గాను 10 నెలల కాలానికి ఒకేసారి నిధుల్ని విడుదల చేయనుంది సర్కారు. ఈ ‘స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్స్’.. పంచాయతీరాజ్, రూరల్, మున్సిపల్, అర్బన్ పాఠశాలలన్నింటికీ అందుతాయని విద్యాశాఖ తెలిపింది.
గ్రాంట్స్ ఇలా…
30 మంది లోపు విద్యార్థులుంటే రూ.3,000
31 నుంచి 100 మందికి రూ.6,000
101 నుంచి 250 మందికి రూ.8,000
251 నుంచి 500 లోపు విద్యార్థులకు రూ.12,000
501 నుంచి 750 మందికి రూ.15,000
750 మంది కన్నా ఎక్కువుంటే రూ.20,000