
హైదరాబాద్(Hyderabad) లో ఏకకాల IT సోదాలు హడలెత్తిస్తున్నాయి. సికింద్రాబాద్ లో బంగారం వ్యాపారి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు జరిగాయి. అటు బంజారాహిల్స్ లోనూ భారీస్థాయిలో అధికారులు రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర రాజధానితోపాటు వరంగల్ లోనూ వివిధ ప్రాంతాలపై ఇన్ కం టాక్స్ అధికారులు నజర్ పెట్టారు. ఇప్పటికే పలువురు వ్యాపారులపై కన్నేసిన యంత్రాంగం.. అవతవకలకు పాల్పడేవారిని క్షుణ్నంగా పరిశీలన చేస్తోంది. గత, ఇప్పటి ఆర్థిక సంవత్సరాల్లో ఏ మేరకు కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి అన్న అంశాలే ఆధారంగా మూకుమ్మడిగా సోదాలు జరుగుతున్నాయి.