రాష్ట్ర పరిపాలన(Administration) సౌధమైన సచివాలయం(Secretariat) కొత్త భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది. సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధుల్లో ఉన్న TGSP సిబ్బందిని మార్చి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)కు అప్పగిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. ఏక్ పోలీస్ నినాదంతో TGSP పోలీసులు ఆందోళనకు దిగిన దృష్ట్యా CM, మంత్రులు, ఇతర ముఖ్యమైన భద్రత విషయంలో ఆ విభాగాన్ని పక్కనపెట్టారు.
సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించిన SPF సిబ్బంది కవాతు చేసి బాధ్యతల్లో దిగారు. రాష్ట్రవ్యాప్తంగా గల బెటాలియన్లలో నిర్వహిస్తున్న ఆందోళనలతో పలువురిపై వేటు పడగా, మరికొంతమందిని డిస్మిస్ చేశారు. దీనిపై అన్ని చోట్లా నిరసనలు వ్యక్తం కావడంతో ఇలాంటి పరిస్థితుల్లో TGSP సిబ్బంది భద్రతను ప్రభుత్వం ఉపసహరించుకుంది.