
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసుల తనిఖీలు(Checkings) అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సొత్తును తరలిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నిచోట్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన చెకింగ్స్ లో పెద్దమొత్తం లభ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లోనే రూ.13.86 కోట్ల విలువైన సొత్తును పట్టుకున్నారు.
కొద్దిరోజుల్లోనే అత్యంత భారీగా
ఇప్పటివరకు రూ.377.68 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 136.09 కోట్ల నగదు ఉండగా, రూ.28.84 కోట్ల మద్యం(Liquor) ను పట్టుకున్నారు. రూ.162.07 కోట్ల విలువైన బంగారం(Gold), వెండి(Silver), వజ్రాలు, ఆభరణాలు.. మరో రూ.18.18 కోట్ల విలువైన మత్తు పదార్థాలు(Drugs), రూ.32.49 కోట్ల విలువైన ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.