IAS, IPS లాంటి పోస్టుల్లో రిజర్వేషన్లు అవసరమా అంటూ తన ‘X’ ఖాతాలో స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడం తీవ్రమైన చర్చకు దారితీసింది. క్షేత్రస్థాయి(Ground Level)లో పనిచేసే IAS, IPSలకు శారీరక దృఢత్వం కావాలని, వైకల్యం ఉన్నవారిని పైలట్లుగా విమానయాన సంస్థలు నియమిస్తాయా.. వైకల్యం గల సర్జన్ల సేవలను మీరు విశ్వసిస్తారా అంటూ పెట్టిన కామెంట్స్ దుమారం రేపాయి.
ఈ ట్వీట్ కు స్పందనగా నిన్న భారీస్థాయిలో ఆమెకు మద్దతు ప్రకటించారు నెటిజన్లు. మహారాష్ట్ర కేడర్ ట్రెయినీ IAS పూజ ఖేడ్కర్ ఘటన తర్వాత స్మిత ట్వీట్ చేయడం, దానికి విశేష స్పందన రావడంతో సివిల్ సర్వెంట్ల రిజర్వేషన్లపై చర్చ మొదలైంది.
స్మిత ట్వీట్ పై దివ్యాంగురాలైన మాజీ అధికారి మల్లవరపు బాలలత, అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీం తీర్పులను ఆమె వ్యతిరేకిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. స్మిత సబర్వాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆమె మరో ట్వీట్ చూస్తే… ‘నా ఉద్దేశమేంటంటే IPS/IFoS, రక్షణ రంగాల్లో ఈ కోటా ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలేదో పరిశీలించవలసిందిగా అభ్యర్థిస్థున్నా.. నా పరిమిత విషయమేంటంటే IASలు కూడా అంతే.. అన్నది సారాంశం.