సెప్టెంబరు 17న అధికారిక వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధానిలో జాతీయ జెండా(Flag) ఎగురవేయనుండగా.. అన్ని జిల్లాల్లోనూ పతాకావిష్కరణ జరుగుతుంది. ఉదయం 10 గంటలకు నిర్వహించే వేడుకల్లో జెండా ఎగురవేసే అతిథుల పేర్లను సర్కారు ప్రకటించింది.
మంత్రులు, శాసనసభతోపాటు మండలిలో కీలక నేతలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఒక్కో జిల్లాలో జెండా ఎగురవేస్తారు. ఆదిలాబాద్ లో షబ్బీర్ అలీ, భద్రాద్రి కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వర్ రావు, మెదక్ లో కె.కేశవరావు, రంగారెడ్డిలో వేం నరేందర్ రెడ్డి సహా అన్ని జిల్లాల్లో పలువురు పతాకావిష్కరణ చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS) ఉత్తర్వులిచ్చారు.