ఫిక్స్ డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, ఒప్పంద సేవల(Outsourcing) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. మొత్తం 12,055 మంది సేవల్ని పొడిగించింది. ఇప్పటివరకు దీనిపై నిర్ణయం రాకపోవడంతో సాంకేతిక కారణాల పేరుతో జీతాలు ఆగిపోయాయి. వీరి సర్వీసు మార్చి 31తో పూర్తయింది. తాజా ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు పొడిగింపు వర్తిస్తుంది. ఈ ఆదేశాలతో మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెస్ పూర్తి కావచ్చింది. ఆర్థిక శాఖ నుంచి నిధులు పంచాయతీరాజ్ శాఖకు చేరగా.. త్వరలోనే సిబ్బంది ఖాతాల్లో జమ కానున్నాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com