
నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదంటూ SFI కార్యకర్తలు.. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విద్యాసంస్థల్లోకి స్టూడెంట్స్ యూనియన్లను అనుమతించకూడదంటూ తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలివ్వడంపై SFI లీడర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.