గత ప్రభుత్వం అందించిన రైతుబంధు నిధుల్లో భారీగా అక్రమాలు(Frauds) జరిగాయా.. ఇకనుంచి ఐదెకరాల కటాఫ్ విధించబోతున్నారా.. సాగుభూముల లెక్కల్ని పక్కాగా చూస్తారా.. ఇవన్నీ ఔననే అనిపిస్తున్నాయి తాజా భేటీ తర్వాత. రైతు భరోసా విధివిధానాల(Guidelines)పై కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ అధికారులే కుండబద్ధలు కొట్టినట్లు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతున్నది.
ఒపీనియన్స్…
రైతు భరోసా అమలుపై ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని రైతుల అభిప్రాయాలు(Openions) తీసుకోవాలని భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రోజుకు 3 సమావేశాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.
92 శాతం చిన్నోళ్లే…
ఈనెల 16 తర్వాత మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. 92 శాతం చిన్న, సన్నకారు(Small) రైతులే ఉన్నారని, వారందరి భూములు 5 ఎకరాల్లోపేనని అధికారులు నివేదించారు. కాబట్టి ఐదెకరాల కటాఫ్ పెడితే బాగుంటుందన్న చర్చ నడిచింది. గత ప్రభుత్వ హయాంలో రూ.26,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని కమిటీకి అధికారులు తెలియజేసినట్లు సమాచారం.