రాష్ట్రంలో 123 మంది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లు(sub inspectors) సర్కిల్ ఇన్స్పెక్టర్లు(circle inspectors)గా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్-IIలో 99 మంది, మల్టీజోన్-Iలో 24 మంది ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు. మల్టీజోన్-IIలో 99 మందికి గాను 70 మంది 2009 బ్యాచ్ కు చెందినవారు ఉండగా.. మిగతా 29 మంది 2012 బ్యాచ్ కు చెందినవారు. ఇక మల్టీజోన్-Iలో మొత్తం 24 మంది 2012 బ్యాచ్ కు చెందిన SIలే ఉన్నారు.
రెండు జోన్ల ఐజీలు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. వీరందర్నీ వివిధ విభాగాల్లో(స్టేట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటెలిజెన్స్, సీఐడీ, SHOలుగా) అడ్జస్ట్ చేయనున్నారు.