
స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. కోల్ ఇండియా కంపెనీలు, ఇతర గనుల సంస్థల్లో పోటీ నిర్వహించారు. పురస్కారాన్ని సింగరేణి CMD ఎన్.బలరాంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. బొగ్గు, విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనే కాకుండా పచ్చదనం, పరిశుభ్రతలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. గాంధీజయంతి నుంచి 30 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. సింగరేణి(Singareni) వ్యాప్తంగా మొత్తం 355 ప్రదేశాల్లో 7,65,583 చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.