శిథిలాల కింద కొంతమంది ఉన్నారని అనుమానిస్తున్నారు. కాపాడండి అంటూ అందులో ఉన్నవారు హాహాకారాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణమవుతున్న బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోవడంపై ఆరా తీస్తున్నారు. ఒక్క ఫ్లోర్ కూడా పూర్తి కాకపోగా, మొత్తం పిల్లర్లపైనే ఆరు ఫ్లోర్ల పనులు నడుస్తున్నాయి. భవనం పక్కనే ఆలయ నిర్మాణం జరుగుతోంది. కూలిన భవనం శకలాలు ఆలయ ప్రాంగణంలో పడ్డాయి. అందులో ఆరుగురు దాకా ఉండొచ్చని భావిస్తున్న అధికారులు.. సహాయ చర్యలు చేపడుతున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి దగ్గర్లోనే ఘటన జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇలాంటి భవనాల్లోనే ఆశ్రయం పొందుతారు.