SLBC పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇప్పటికే 35 కి.మీ. పూర్తయింది. మిగిలిన 9 కి.మీ. పనుల కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. నెలకు 178 మీటర్లు తవ్వేలా ప్రపంచ అత్యాధునిక టెక్నాలజీ అయిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించబోతున్నారు. తవ్వకాల్లో ఎదురయ్యే ప్రమాదాల్ని ఈ సర్వే ద్వారా ముందుగానే గుర్తించవచ్చని మంత్రి తెలిపారు. రెండువైపుల తవ్వకాలు సాగుతున్న ఈ టన్నెల్ కు ఒక భాగం నుంచి 21, మరో భాగం నుంచి 14 కి.మీ. పూర్తయింది.