IAS అధికారి స్మిత(Smita) సబర్వాల్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో AI జనరేటెడ్ ఫొటోల్ని ‘X’లో పోస్టు చేసినందుకు గాను ఆమెకు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులకు సహకరించి పూర్తి వివరాలు తెలియజేశానని ‘X’లోనే ప్రకటించారు. ‘చట్టం అందరికీ సమానమేనా.. ఆ పోస్టు 2 వేల మందికి చేరింది.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రశ్నలకు వివరణ ఇచ్చా.. నేను రీపోస్ట్ చేసినట్లే ఆ 2 వేల మంది చేశారు.. వారందరిపై చర్యలు ఉంటాయా.. అలా జరగకపోతే కేవలం కొందరినే టార్గెట్ చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది..’ అని ఆమె స్పష్టం చేశారు.