
సీనియర్ IAS స్మిత సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొద్దిరోజులుగా సెలవులో ఉన్న ఆమె.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీరుపై ఏర్పాటైన జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ను రద్దు చేయాలని కోరారు. నివేదికను సవాల్ చేసిన ఆమె.. కేసు రద్దు చేయాలని, అప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా అది లిస్ట్ కావాల్సి ఉంది. లిస్ట్ అయ్యాకే వాదనలకు ఆస్కారం ఉంటుంది. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ విచారణ, వాంగ్మూలం సేకరించిన విధానాన్ని ఆమె ప్రశ్నించారు.