సీనియర్ IAS స్మిత సభర్వాల్ సుదీర్ఘ సెలవు పెట్టారు. ఆమెకు ఆరు నెలల పాటు లీవ్ మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా(Sultania) ఉత్తర్వులిచ్చారు. 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు ఆమె విధులకు దూరంగా ఉంటారు. పిల్లల సంరక్షణ(Child Care) పేరిట సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ అయిన స్మిత సభర్వాల్ బాధ్యతల్ని మరో IAS పి.కాత్యాయనిదేవికి కట్టబెట్టారు.