అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ అధికారుల బదిలీలను ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడు రోజుల క్రితం నలుగురు IASల బదిలీలతో మొదలైన ప్రక్రియ… పోలీసు డిపార్ట్ మెంట్ వరకు కొనసాగింది. తాజాగా ఈ రోజు సాయంత్రం 31 మంది IASలకు స్థానచలనం కల్పించింది. అందులో కొందరికి కీలక బాధ్యతలు కట్టబెట్టగా… మరికొందరు సీనియర్లను లూప్ లైన్ కు పరిమితం చేసింది. శుక్రవారం సాయంత్రం IAS ట్రాన్స్ ఫర్స్ పూర్తి కాగానే రాత్రికి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. వీరితోపాటు అడిషనల్ కలెక్టర్లు, RDOలకు స్థాన చలనం కల్పించింది. వచ్చే ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు(RO)గా వ్యవహరించే అధికారుల్ని సైతం బదిలీ చేసింది.
జగిత్యాల RDO ఆర్.డి.మాధురిని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్(Revenue)గా… కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(Revenue) జి.వి.శ్యాం ప్రసాద్ లాల్ ను పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్(Revenue)గా… గజ్వేల్ RDO డి.విజేందర్ రెడ్డిని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్(Revenue)గా బదిలీ చేసింది. మంథని RDO కె.వీరబ్రహ్మచారిని సూర్యాపేట RDOగా… ఖమ్మం RDO ఎం.వి.రవీంద్రనాథ్ ను తొర్రూర్ RDOగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు.