ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి సంస్థ మరో డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికుల(Passengers)కు టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజధాని AC, సూపర్ లగ్జరీ బస్సులకు రాయితీ(Discount) వర్తించనుంది. డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం http://www.tgsrtcbus.in ని సంప్రదించాలని తెలిపింది.