
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్షీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కుంకుమార్చనల పూజలు ఉంటాయని దేవస్థానం తెలిపింది. ఈ కుంకుమార్చనలకు ప్రత్యేక టికెట్లను అందుబాటులో ఉంచింది. పూజల్లో పాల్గొనాలన్న ఆసక్తి గల భక్తులు తమను సంప్రదించాలని సూచించింది. ఇవాళ్టి నుంచి మొత్తం నాలుగు శుక్రవారాలు కుంకుమార్చలను ఉంటాయి. ఈ నెల 18, 25.. వచ్చే నెల 1, 8, తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంకుమార్చనలో పాల్గొనే భక్త దంపతులు రూ.2,000 టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లతో పూజల్లో పాల్గొనే దంపతులకు స్వామి వారి శేషవస్త్రంగా కళ్యాణం శెల్లా, కనుము, మహాప్రసాదంగా అభిషేకం లడ్డూ అందజేస్తారు.