స్పౌజ్, మ్యూచువల్ బదిలీల ఖాళీల్లో సాధారణ ఉద్యోగులకు అవకాశమివ్వాలని TSUTF డిమాండ్ చేసింది. KGBVలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS) సహా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ బదిలీ(Shifting)కి అవకాశమివ్వాలని కోరింది. ట్రాన్స్ఫర్స్ కు అప్లై చేసుకునేవారి వివరాల్ని ఈనెల 26లోగా పంపాలన్న ఉత్తర్వుల్ని స్వాగతించింది. అయితే పలు KGBVలు అప్ గ్రేడ్ కావడం, కొందరు ఇతర ఉద్యోగాలకు వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపింది. మరికొందరు అతి తక్కువ వేతనాలతోనే దూర ప్రాంతాల్లో ఉంటూ బదిలీలు కోరుకుంటున్నారని, గత 3 ఏళ్లలో అవకాశం రానందున అలాంటి వారికో ఛాన్స్ ఇవ్వాలని TSUTF కోరింది. సాధారణ ఉద్యోగుల షిఫ్టింగ్ కు అనుకూలంగా ఉండేలా దరఖాస్తు గడువు మరో రెండ్రోజులు పొడిగించాలని అభ్యర్థించింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com