వాణిజ్య పన్నుల శాఖ(Commercial Taxes Department) ఇంఛార్జ్ కమిషనర్ గా T.K.శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవి(2004 IAS)కి వాణిజ్య పన్నుల శాఖను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఆమె ఇంఛార్జి కమిషనర్ గా కొనసాగుతారని అందులో తెలియజేశారు.