టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆయనకు ఇంటి స్థలంతోపాటు సర్కారీ ఉద్యోగం ప్రకటించింది. హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని, ఇంటి స్థలాన్ని హైదరాబాద్ పరిసరాల్లో గుర్తించాలని CM ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరు, గౌరవాన్ని తీసుకొచ్చారంటూ సిరాజ్ ను రేవంత్ కొనియాడారు.
27 టెస్టుల్లో 74.. 41 వన్డేల్లో 68.. 13 టీ20ల్లో 13 చొప్పున వికెట్లు తీసుకున్నాడు సిరాజ్. టెస్టులు, వన్డేల్లో బుమ్రా, షమితోపాటు టీమ్ఇండియాకు ప్రధాన బౌలర్ గా సేవలందిస్తున్నాడు.