
వానాకాలం సీజన్ పంట కొనుగోలు కోసం రైతులకు చెల్లించాల్సిన నిధులు రూ.19,112 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈసారి రికార్డ్ స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రానుండగా.. అందులో 80 లక్షల మె.ట. కొనుగోలు జరగనుంది. మొత్తం రూ.21,112 కోట్లు కానుండగా.. అందులో రైతులకు చెల్లించేది రూ.19,112 కోట్లు అని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దిగుబడులు-కొనుగోళ్లపై ఆయన సమీక్ష(Review) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాల సాగులో 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు ఉన్నాయి.