రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఎంతకూ తగ్గే పరిస్థితి లేకపోవడంతో విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు అన్ని విద్యాసంస్థలకు సెలవు(Holiday) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు రేపు మూతపడనున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించగా… మిగతా అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. అధికారులతో సమీక్ష(Review) నిర్వహించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. అటు అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేసింది సర్కారు.