మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా సబ్సిడీ సిలిండర్ లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన రాయితీ(Subsidy)ని లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసింది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ(Civil Supplies) తన ప్రకటనలో తెలియజేసింది. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక ప్రకటన చేసింది.
ఏప్రిల్ 13 నాటికి…
ఈ స్కీమ్ కింద ఈనెల 13 నాటికి 18.86 లక్షల మంది రాయితీ సిలిండర్ పొందారని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 13 నాటికి కొందరైతే రెండో సిలిండర్ ను సైతం తీసుకున్నారట. ఇలా మొదటి, రెండో విడత లెక్కేస్తే మొత్తంగా 21.29 లక్షల మంది లబ్ధిదారుల(Beneficieries)కు రూ.59.97 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని ఆయా అకౌంట్లలో జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా…
రాయితీ సిలిండర్ అర్హులు రాష్ట్రవ్యాప్తంగా 39.33 లక్షల మందిని ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం(Scheme) ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. సిలిండర్ ధర మొత్తాన్ని ముందుగా లబ్ధిదారులే చెల్లించాల్సి ఉండగా.. రూ.500 పోను సబ్సిడీని ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసే విధానం అమలవుతున్నట్లు సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్ తెలిపింది.