ఈరోజు నుంచి అమలు చేస్తున్న రూ.500 గ్యాస్ సిలిండర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు దారులకు ఈ సబ్సిడీ సిలిండర్ ను అందిస్తారు. గ్యాస్ కంపెనీలకు రాయితీ(Subsidy)ని నెలనెలా ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆ సబ్సిడీని లబ్ధిదారులకు గ్యాస్ కంపెనీలు చెల్లిస్తాయని GOలో తెలియజేశారు.
పూర్తిగా చెల్లించాల్సిందే…
ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 ఉండగా… డెలివరీ ఛార్జీ పేరిట మొత్తం రూ.1,000 దాకా తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇచ్చే రూ.500కే గ్యాస్ సిలిండర్ కు ఎంత చెల్లించాలన్నది సంశయంగా మారింది. కానీ దీనిపై ఇప్పటికే పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ సిలిండర్ కోసం ముందుగా మొత్తం నగదు అయిన రూ.955 చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ రూ.955లో సబ్సిడీ అయిన రూ.500 నగదు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా(Accounts)ల్లో జమ కానుంది.