కంచ గచ్చిబౌలి(Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూముల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. స్థలాన్ని సందర్శించి వివరాలు సమర్పించాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది. మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాక 3:45 గంటలకు విచారణ జరపనుంది. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చీఫ్ సెక్రటరీ(CS)కి స్పష్టం చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు జస్టిస్ బి.ఆర్.గవాయ్ ధర్మాసనాన్ని(Bench) అభ్యర్థించారు. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నడుస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలపడంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వటం లేదని తెలిపింది.