అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో రెవెన్యూ అధికారి పట్టుబడ్డారు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్(Amangal) తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిని అధికారులు అరెస్టు చేశారు. భూమి రిజిస్ట్రేషన్, అందులోని లోపాల్ని సరిచేసేందుకు గాను లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో రూ.50 వేలను గతంలోనే తీసుకోగా.. మరో రూ.50 వేలు తీసుకుంటుండగా దొరికిపోయారు. తన అమ్మమ్మ భూమి విషయంలో ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై ఆమె మవవడు ACBని ఆశ్రయించాడు.