
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief justice)గా జస్టిస్ అలోక్ అరాధే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అలోక్ అరాధేతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి CM కేసీఆర్ హాజరవుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ CJగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్ అరాధే.. 1988 జులై 12న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 సెప్టెంబరు 16న జమ్మూకశ్మీర్ న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ అలోక్.. 2018లో మూడు నెలల పాటు ఆ రాష్ట్ర హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.
2018 నవంబరు 17 నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్న ఆయన.. అక్కడా కొంతకాలం CJగా పనిచేశారు. అక్కణ్నుంచి ప్రస్తుతం తెలంగాణకు బదిలీ అయి చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.