Published 26 Jan 2024
రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సర్కారుకు అహంకారం పెరిగిపోవడం వల్లే అధికారాన్ని త్యజించాల్సి(Renounced) వచ్చిందని గత BRS ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఓటేసినవారు ఊరుకోబోరని అన్నారు. గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం ఆమె ప్రసంగించారు. నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించబోదన్న ఆమె.. అహంకారం, నియంతృత్వం చెల్లదన్న రీతిలో రాష్ట్ర ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
గత సర్కారు హయాంలో…
గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ తమిళిసై, KCR సర్కారు మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. గవర్నర్ కోటా MLCలు, ఆర్టీసీ సిబ్బంది విలీనం సహా వివిధ అంశాల్లో రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య దూరం బాగా పెరిగింది. శాసనసభ సమావేశాల(Assembly Sessions)కు సైతం గవర్నర్ ను పిలవని వాతావరణం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. TSPSC ఛైర్మన్, మెంబర్లు సహా గవర్నర్ కోటా MLCల నియామకంలో ప్రభుత్వం పంపిన ఫైల్స్ ఆమోదించేలా ఉన్నాయంటూ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.