విధుల(Duties)కు దీర్ఘకాలంగా దూరంగా ఉంటున్న ఉపాధ్యాయులపై వేటు పడింది. ఇంచుమించు 20 ఏళ్ల కాలంగా డ్యూటీలకు హాజరుకాని 16 మంది టీచర్లను తొలగిస్తూ DEO ఆదేశాలిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2005, 2006 నుంచి 16 మంది టీచర్లు బడికి డుమ్మా కొడుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 18 మంది బడికి ఎగనామం పెడుతుండగా, వారందరికీ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాటికి స్పందించి ఇద్దరు బాధ్యతల్లో చేరారు. కానీ మిగిలిన 16 మంది ఇప్పటికీ స్పందించకపోవడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏడు నెలల క్రితం సైతం వీరందరికీ నోటీసులివ్వగా, తాజాగా మరోసారి పంపించినా స్పందన శూన్యం. దీంతో సదరు 16 మంది పంతుళ్ల(Teachers)ను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులిచ్చారు.