
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కేసులో విచారణను వేగంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. పిటిషన్ల వల్ల ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొందని పిటిషన్ లో పేర్కొంది. టీచర్ల ట్రాన్స్ ఫర్ల కేసుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court)లో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు ముగిసి విచారణ పూర్తయింది. ఇంతకుముందు విధించిన స్టేను ఎత్తివేస్తేనే బదిలీలు సజావుగా సాగుతాయని తెలిపింది.
ఈ స్టే ఎత్తివేతకు మధ్యంతర పిటిషన్ కూడా వేశామని అదనపు అడ్వొకేట్ జనరల్(AAG) కోర్టుకు విన్నవించారు. అయితే స్టే ఎత్తివేయాలన్న పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.