2025-26 బడ్జెట్(Budget)కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ చదువుతారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి పద్దులు ఇవి. లోక్ సభ ఎన్నికలతో గతేడాది ఏప్రిల్, మే, జూన్ కోసం 2024 ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెచ్చారు. అప్పుడు వార్షిక బడ్జెట్ 2.9 లక్షల కోట్లు కాగా.. ఈసారి అంతకుమించి ఉండనుందని తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై బడ్జెట్ తయారైంది.