ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అమలు చేయాల్సిన పథకాల(Schemes)పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) నేడు సమావేశం కాబోతున్నది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్న(Implement) సర్కారు.. ఇవాళ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రజల ఆలోచనా తీరు చూస్తే మిగతా గ్యారంటీలు, స్కీమ్ ల కన్నా రేషన్ కార్డుల పైనే ఎక్కువగా ఆందోళనతో ఉన్నారు. BRS ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అయినా ఆ పని చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. డిసెంబరు 7న కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు.. జనవరిలో రేషన్ కార్డులపై క్లారిటీ ఇస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ జనవరి పూర్తయి ఫిబ్రవరి నడుస్తున్నా ఇంతవరకు క్లారిటీ లేకపోవడంతో జనాల్లో అసహనం కనిపిస్తోంది.
సిలిండర్, కరెంటుపై చర్చ…
ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా రూ.500 సబ్సిడీ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Power)పైన చర్చ సాగనుంది. వీటికితోడు వచ్చే శాసనసస సమావేశాల(Assembly Sessions)పై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే 11 లక్షల కొత్త అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్న అనుమానాలు సామాన్యుల్లో బలపడుతున్నాయి. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన(Scrutiny) పూర్తయిందని చెబుతున్నా.. పూర్తిస్థాయిలో దాని లెక్కలు తేల్చాలంటే ఇంకా టైమ్ పడుతుంది. ఇలాంటి సమయంలో రేషన్ కార్డులపై క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో జనాల్లోనూ నైరాశ్యం ఏర్పడే అవకాశముంది.
లింక్ తీసేస్తారా…?
రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీతో ఉన్న లింక్ ను తీసివేస్తే ఎలా ఉంటుందని CM రేవంత్.. అధికారులను అడిగారు. నిజంగా ఇది జరిగితే రేషన్ కార్డుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. ఉన్నత కుటుంబాలు సైతం ఆరోగ్యశ్రీ కోసమే కార్డులు తీసుకున్నాయి. వీరి సంఖ్య మరింత పెరుగుతుండటంతో ఆరోగ్యశ్రీతో లింక్ లేకుండా చూడాలన్న అభిప్రాయాన్ని వైద్యారోగ్య శాఖ సమీక్ష(Review) సందర్భంగా CM గుర్తు చేశారు. కొత్త కార్డుల కోసం 11 లక్షల అప్లికేషన్లు వస్తే.. ఇపుడున్న కార్డుల్లో రేషన్ తీసుకోనివారు 11 శాతం మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కార్డులపై జాప్యమనేది జనాల నుంచి విమర్శలకు కారణమయ్యే ఛాన్స్ ఉంది. మరి కేబినెట్ భేటీలో దీనిపై హింట్ ఇస్తారో లేదో చూడాలి.
Published 04 Feb 2024