ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు మరోసారి తెలంగాణ కంప్లయింట్ చేసింది. అనుమతులు లేకుండా శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు చేస్తున్నారంటూ లెటర్ రాసింది. ఈ మేరకు తెలంగాణ ENC మురళీధర్.. KRMB(Krishna River Management Board) ఛైర్మన్ కు లేఖ పంపించారు. పర్మిషన్ లేకుండా పనులు చేపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన NGT(National Green Tribunal) ఇచ్చిన ఆదేశాల్ని గుర్తు చేశారు. పనులు ఇలాగే కంటిన్యూ అయితే శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని AP తరలించుకుపోతుందని ఫిర్యాదు చేశారు.
తక్షణమే ఆ పనుల్ని నిలిపివేసేలా చూడాలని లేదంటే ఎక్కువ నీటిని బేసిన్ బయటకు తరలించే ప్రమాదం ఉందని లెటర్ లో ENC తెలియజేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని KRMBని కోరారు.