డీఎస్సీ ఫైనల్ ‘కీ’ విడుదల చేయడంతో ఇక ఫలితాల(Results)కు రంగం సిద్ధమైంది. అతి కొద్దిరోజుల్లోనే 2024 DSC రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆగస్టు 13న ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్ కాగా, 28 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఫైనల్ ‘కీ’ విడుదల కావడంతో ఇక జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్(Merit List) ప్రకటిస్తారు. వీలైనంత త్వరగా కొత్త ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవాలని సర్కారు భావిస్తున్న దృష్ట్యా.. ఈ దిశగా DSC రిజల్ట్స్ విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
11,062 పోస్టుల భర్తీకి గాను 2.79 లక్షల మందికి పైగా అప్లై చేసుకుంటే 87% మందికి పైగా పరీక్షలు రాశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT) పరీక్షలకు అత్యధికంగా 92% మంది హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్లు 2,629, SGTలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, స్కూల్ అసిస్టెంట్లు(స్పెషల్ ఎడ్యుకేషన్) 220, SGT(స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులున్నాయి.