ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(Higher Education) ఛైర్మన్ లింబాద్రి వీటిని రిలీజ్ చేశారు. నాగర్ కర్నూల్ విద్యార్థి నవీన్ కు మొదటి మొదటి ర్యాంక్(First Rank) దక్కింది. హైదరాబాద్ యువతి అషిత రెండో ర్యాంకు సాధించింది. ఈ పరీక్షకు 29,463 మంది దరఖాస్తు(Apply) చేసుకోగా.. అందులో 96.90 శాతం మంది పాస్ అయ్యారు.
మొత్తంగా 28,549 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. పాసయిన వారిలో మహిళల శాతమే 98.74గా ఉండటం విశేషంగా నిలిచింది. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు కోసం ఈ ఏడాది ఎడ్ సెట్(EdCET)ను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా గల బీఈడీ కాలేజీల్లో 14 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.