DSC పరీక్షల్ని వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు.. అసెంబ్లీలో చర్చించాక పోటీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని CM హామీ ఇవ్వడంతో DSC, గ్రూప్-2, గ్రూప్-3పై క్లారిటీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ(School Education) పూర్తి క్లారిటీ ఇచ్చింది.
యథావిధిగానే..
ముందుగా అనుకున్న షెడ్యూల్(Schedule) ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తేల్చిచెప్పింది. ఈ నెల(జులై) 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని.. అందుకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.
ఈనెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. జులై 19 నుంచి 23 వరకు మాత్రం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన SGT పరీక్షలు ఉంటాయి.