రాష్ట్రంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్యశాఖలోని ఖాళీల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. వివిధ విభాగాల్లో(Several Departments) కోసం రాష్ట్ర, వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(MHSRB) ద్వారా ఈ రిక్రూట్మెంట్ నిర్వహించబోతున్నది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి.
రివ్యూ తెల్లారే…
వర్షాకాల సీజన్లో తలెత్తే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిన్న తమ డిపార్ట్మెంట్ తో సమీక్ష(Review) నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(PHC)ల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి.
భర్తీ చేయబోయే పోస్టులు ఇలా…
పోస్టు | సంఖ్య |
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు | 531 |
ల్యాబ్ టెక్నీషియన్లు | 193 |
స్టాఫ్ నర్సులు | 31 |
మొత్తం పోస్టులు | 755 |