వేర్వేరు(Different) శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ దంపతులు ఆ విభాగాల మధ్య సమన్వయలోపం(Co-Ordination) వల్ల నగరాల్లోనే 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇద్దరూ నగరంలో పనిచేస్తున్నా నాలుగేళ్లు పూర్తయితే కచ్చితంగా వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి.
ఒకరు నగరంలో, మరొకరు రూరల్ ఏరియాలో పనిచేస్తూ తమనూ నగరానికి పంపాలంటూ స్పౌజ్ కేసు రూల్ కింద అడుగుతున్నారు. ఇలా అడిగేవారిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేకుండా, అవసరమైతే నగరం నుంచే గ్రామీణ ప్రాంతానికి పంపాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ పోస్టులో ఉంటూ డిప్యుటేషన్ పై నగరాల్లో(Cities) పనిచేస్తున్నారు. ఆ సర్వీసునే లెక్కలోకి తీసుకుని ఇప్పుడు సిటీలోనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రెజర్ తెస్తున్నారు. దంపతులిద్దర్నీ అలాగే పంపాలని కోరుతున్నారు.
డిప్యుటేషన్ అయినా ఏదైనా నాలుగేళ్లపాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి ఆ ఉద్యోగులకు అదే ప్రాంతంలో పోస్టింగులు ఇవ్వొద్దంటూ ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒక శాఖలోని ఒకే కేడర్లో బదిలీలు 40 శాతానికి మించొద్దని, ఉన్నవారందర్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ కదపకూడదని స్పష్టం చేసింది.