అత్యంత నిరుపేదలను గుర్తించి అందులో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇళ్లు కేటాయించబోతున్నారు. ఈ ఏడాది నిర్మించబోయే నాలుగున్నర లక్షల ఇళ్లకు గాను ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా రూ.22,500 కోట్లు వెచ్చిస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉండగా.. అర్హులైన వారికే ఇళ్లు దక్కాలన్న ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ప్రత్యేక యాప్ తీసుకువచ్చారు.
గిరిజన సహకారాభివృద్ధి సంస్థ(ITDA) పరిధిలో ఆదివాసీల్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని CM రేవంత్ అన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించే 3,500 ఇళ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా కింద అక్కడి జనాభా ఆధారంగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామన్నారు.