పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం(University) వరకు విద్యా సంస్థల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పాలన్న ఉద్దేశంతో తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే(NAS)-2021 ప్రకారం పేద విద్యార్థుల్లో క్షీణిస్తున్న అభ్యసన ఫలితాలు.. యూనివర్సిటీల స్థాయిలో తగ్గిపోతున్న నైపుణ్యాలను గాడిలో పెట్టేలా కమిషన్ కు రూపకల్పన చేసింది. స్కిల్స్ పెంచడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులే లక్ష్యంగా రోడ్ మ్యాప్ రూపొందించాలన్నది ఉద్దేశం.
ఈ కమిషన్లో ఛైర్ పర్సన్, విద్యారంగంలో ప్రముఖులైన ముగ్గురు వ్యక్తులతోపాటు ప్రభుత్వం తరఫున సభ్య కార్యదర్శి(Member Secretary-HOD) సభ్యులుగా ఉంటారు. వీరి నియామకాలు చేపట్టాల్సి ఉండగా, బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి రెండేళ్ల వరకు పదవీకాలం ఉంటుంది. విస్తృత సంప్రదింపులకు గాను నిపుణులు, కన్సల్టెంట్స్, ప్రొఫెషనల్స్ నుంచి సలహాలు, సూచనల్ని కమిషన్ స్వీకరిస్తుంది. విద్యాశాఖ ఉద్యోగుల సేవల్ని ఆన్ డ్యూటీ(OD), డిప్యుటేషన్ పద్ధతిలో వినియోగించుకుంటుంది.
లక్ష్యాలివే…
అభివృద్ధి చెందుతున్న బోధనా పద్ధతులు
డేటా ఆధారిత రంగాలలో మార్పులకు అనుగుణంగా స్కిల్స్
మౌలిక సదుపాయాల అవసరాలు
మారుతున్న కాలానుగుణ విద్య
లెర్నింగ్ ఫలితాల అంచనా
వీటి ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్