తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. అధ్యక్ష పదవికి ఐదుగురు పోటీ చేయగా ఎ.జగన్ గెలుపొందారు. ఆయనకు 1,724 ఓట్లు పోలయ్యాయి. వైస్ ప్రెసిడెంట్ గా రాజేశ్వర్ రెడ్డి.జి.. రెండు సెక్రటరీ పదవుల్లో ఖాజా విజ్రత్ అలీ, ఇంద్రసేనారెడ్డి నూకపల్లి విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా అనిరుధ్ నెల్లికొండ, ట్రెజరర్ గా పాపయ్య పెద్దాకుల.. గెలుపును సొంతం చేసుకున్నారు. వీటితోపాటు వివిధ రకాల పదవులకు సైతం ఎన్నికలు జరిగాయి.