వక్ఫ్ బోర్డు సంపన్నుల కోసమే తప్ప పేదలకు ఉపయోగపడేలా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్ భీమపాక సీరియస్ అయ్యారు. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని నిర్వహణ కోసం మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ గతేడాది కోర్టు ఉత్తర్వులిచ్చింది. అందులో ఈక్వల్ మెంబర్స్ గా షియా, ఇమామియా, ఇస్నా, ఆషారి, అక్బరీ, ఊసూలీలను చేర్చి ముగింపు పలకాలంటూ 2024 డిసెంబరు 23న తీర్పునిచ్చింది. ఇంతవరకు ఆదేశాల్ని అమలు చేయకపోవడంపై జడ్జి మండిపడ్డారు. పాదరక్షలు విడిచి మరీ న్యాయమూర్తి.. ఖురాన్ లోని అంశాలను చదివి వినిపించారు. అనంత కరుణామయుడు అల్లా అంటూ ఆయన పేరిట ఖురాన్ అంశాల్ని చదివారు.