ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు రెడీ అయింది. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని ఈనెల 22న ప్రకటించబోతున్నారు. ఈ రిజల్ట్స్ ను నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయంలో.. డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటిస్తారు. గత నెల(మార్చి) 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెల 18నే స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించగా, అనుకున్న సమయానికే రిజల్ట్స్ విడుదల చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in ఇవి అందుబాటులో ఉంటాయి.