తెలంగాణలో తలదాచుకుంటున్న(Shelter) పాకిస్థానీల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కేంద్రం విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిపోనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. ఈ నెల 30లోపు అటారీ-వాఘా సరిహద్దు మీదుగా సొంత దేశానికి వెళ్లాలంటూ కేంద్రం గడువు విధించింది. లాంగ్ టర్మ్, మెడికల్ వీసాలు కలిగిన వారికి మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. మిగతావారు వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 230 మంది పాకిస్థానీలు ఉన్నట్లు గుర్తించగా, అందులో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలతో ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో ముగ్గురు, నిజామాబాద్ లో 8 ఉన్నట్లు పోలీసులు తేల్చారు.