ప్రభుత్వ పాఠశాలల్లో(Govt Schools) ఇచ్చిన కొన్ని పుస్తకాల్ని తిరిగి పంపాలని విద్యాశాఖ ఆదేశించింది. మిగిలిన పుస్తకాల్ని పంపిణీ(Dirstribution) చేయకుండా వాటిని తిప్పి పంపాలని ఈ మేరకు DEOలకు ఆదేశాలు జారీ చేసింది. బడులు నిన్న పునఃప్రారంభం కాగా.. ఆ రోజు నుంచే విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నారు.
జరిగింది ఇది…
1 నుంచి పదో తరగతి తెలుగు పుస్తకాల్లో ‘ముందుమాట’ను మార్చకపోవడం వివాదమైంది. ఎప్పుడో ముద్రించిన ‘ముందుమాట’ను ఉన్నది ఉన్నట్లుగా అలాగే ఉంచారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్లే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి, విద్యా మంత్రి మారినా ‘ముందుమాట’ మారకపోవడంపై విద్యార్థుల్లో సందేహాలు, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది.
గతంలో…
ఇది వివాదాస్పదం కావడంతో వాటిని తక్షణమే తిప్పి(Return) పంపాలని అన్ని జిల్లాల DEOలను విద్యాశాఖ ఆదేశించింది. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు తప్పుల స్థానంలో స్టిక్టర్లు అతికించారు. ఇంత పెద్ద విషయాన్ని కనీసం DEOలు, వారి ఆఫీసుల్లోనూ గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి.