రాష్ట్రం(Telangana)లో జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష కమలం(Saffron) పార్టీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇంచుమించు ఈ రెండు పార్టీలే చెరి సగం సీట్లు పంచుకోబోతున్నట్లు సర్వేలు తేల్చాయి. భారతీయ జనతా పార్టీ(BJP)తోపాటు హస్తం పార్టీకి సమాన స్థాయిలో స్థానాలు దక్కుతాయని ఆయా సంస్థలు వెల్లడించిన సర్వేలో బయటపడింది.
ఇండియా టీవీ, ఆరా, పీపుల్స్ పల్స్, ఏబీపీ సీ-ఓటర్, ఇండియా టీవీCNX సర్వేల్లో ఇరు పార్టీలు సమానంగా సీట్లు గెలుచుకుంటాయని చెప్పగా.. జన్ కీ బాత్ సర్వే మాత్రం BJPకే ఎక్కువ సీట్లను తెలిపింది. టుడేస్ చాణక్య సైతం BJPకి 10-14, కాంగ్రెస్ కు 3-7, ఎంఐఎంకు 0-1 వస్తాయని చెప్పింది.
బీఆర్ఎస్ కు బిగ్ షాక్…
మొన్నటివరకు రెండు దఫాలు(Two Terms)గా పాలనా పగ్గాలు చేపట్టి అప్రతిహతంగా దూసుకుపోయిన భారత్ రాష్ట్ర సమితి(BRS)కు గడ్డు కాలం నడుస్తున్నది. ఆ పార్టీకి 0-1 సీటు అని కొన్ని సర్వేలు.. అసలు సీట్లే దక్కవని మరికొన్ని సర్వేలు తేల్చాయి. దీంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తున్నది. అయితే ఈ సర్వేలే తుది ఫలితాలు కావు కదా అన్న మాటలూ ఆ పార్టీలో వినపడుతున్నాయి.